చిన్నారుల ప్రతిభ అభినందనీయం..
జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి
రామాయంపేట, ఫిబ్రవరి 27 ( ప్రజాస్వరం ):
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక వివేకానంద విద్యాలయంలో ప్రాజెక్టుల ప్రదర్శనను జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన దాదాపు 200 కు పైగా ప్రాజెక్టులను చూసిన ఆయన వాటిపై పలు ప్రశ్నలు సంధించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనం చేసే ప్రతి పనిలో సైన్స్ ఉంటుందన్నారు. సైన్స్ లేనిదే ప్రపంచంలో ఏ పని చేయలేమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్ ఆర్ వో విద్యాసాగర్ మట్టి లేకుండా నీటితో పండించే వ్యవసాయ పద్ధతులపై చేసిన ప్రాజెక్టును ఆసక్తిగా తిలకించారు. ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు తయారు చేసిన ఆర్గానిక్ ఫార్మింగ్, హైడ్రోపోనిక్స్, బయో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్, గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రాజెక్టులను వీక్షించి అభినందించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ నరేందర్, ఎస్సైలు విజయ్ సిద్ధార్థ, హరీష్ లు పాల్గొని విద్యార్థులను అభినందించారు. కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులకు అమూల్యమైన సూచనలు చేసిన అతిథులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.రాంకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సైన్స్ ఉపాధ్యాయులు రాంప్రసాద్, నీరజ, జ్యోతిక తదితర ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.


