కుట్రలు పటాపంచలు....
తెలంగాణ జాగృతి మెదక్ జిల్లా నాయకులు విరపారి రమేష్ గౌడ్ ...
కడిగిన ముత్యంలా కవితక్క.....
కుట్రదారులకు చెంపదెబ్బ కోట్టే విధంగా తీర్పు ఇచ్చిన న్యాయ స్థానం...
మెదక్, ఫిబ్రవరి 27 (ప్రజాస్వరం):
తెలంగాణ జాగృతి కవితక్క పై కుట్ర దారులకు చెంప దెబ్బ కొట్టినట్లు విధంగా న్యాయస్థానం క్లీన్ షీట్ ఇచ్చిందని మెదక్ జిల్లా నాయకులు రమేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధినేత్రి కవితక్క మీద పెట్టిన తప్పుడు కేసును పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఈరోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేసును కొట్టివేయడం చాలా సంతోషకరం. కవితక్క పై పెట్టిన ఢిల్లీ లిక్కర్ కేసు అనేది తప్పుడు కేసు అని రౌస్ ఎవెన్యూ కోర్టు తేల్చి చెప్పి కేసులు కొట్టివేయడం సంతోషకరమైన విషయం సిపిఐ పెట్టిన లిక్కర్ లో కేసులో స్కాం లేదని కోర్టు తీర్పు ఇచ్చిందని వారు అన్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం కావాలని రాజకీయంగా దెబ్బ కొట్టడం కోసమే ఇలాంటి తప్పుడు కేసులకు పాల్పడిందని ఈ కేసులో కవిత అక్క తో పాటు కేజ్రీవాల్ మనీష్ సిసోసిడా అందరికీ క్లీన్ చీట్ వచ్చిందని అన్నారు. నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది సత్యం నిలబడుతుంది చెప్పడానికి ఈ తీర్పే నిదర్శనం. తెలంగాణ ఆడబిడ్డ పై అక్రమ కేసులు పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి న్యాయ స్థానంలో చెప్ప దెబ్బ లాంటి తీర్పు వచ్చిందని తెలంగాణ ప్రజలు రాబోయే ఈ కలలో అక్రమ కేసులు పెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని ఓటుతో బుద్ధి చెబుతారని వారు అన్నారు. రాజకీయంగా సహాకరించాని వారిపైన ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం మానుకోకపోతే ప్రజలే బిజెపి పార్టీకి బుద్ది చెబుతారని అన్నారు. భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కవితక్కనియని ఆయన తెలిపారు


