ఉపాధ్యాయులుగా విద్యాబోధన చేసిన విద్యార్థులు....
చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 27 ( ప్రజాస్వరం):
చిన్న శంకరంపేట మండలం సూరారం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు, పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వివిధ తరగతులలో విద్యాబోధన చేశారు, ప్రధానోపాధ్యాయురాలుగా సంధ్య, మండల విద్యాధికారిగా వంశీ, జిల్లా విద్యాధికారిగా శివ, అడిషనల్ కలెక్టర్ గా వైష్ణవి, జిల్లా కలెక్టర్ గా నవనీత, లు విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయి రెడ్డి ఉపాధ్యాయ వృత్తి ఎంత విశిష్టమైనదో వారికి అర్థమయ్యే విధంగా వివరించారు పదవ తరగతి పరీక్షల గురించి పలు జాగ్రత్తలు సూచించారు, అనంతరం ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించిన విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సాధక బాధకాల గురించి సూచించారు, ఉపాధ్యాయుల యొక్క విలువలను తెలుసుకున్నామని ఒకరోజు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని వారన్నారు, ఈ కార్యక్రమంలో పాఠశాల గదిచాడు ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డి తోపాటు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు


