నాలుగవ తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం....
టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నరేందర్...
మెదక్, ఫిబ్రవరి 27 (ప్రజాస్వరం):
నాలుగో తరగతి ఉద్యోగుల అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ అన్నారు. శుక్రవారం స్థానిక టీఎన్జీవో భవన్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు జలగం ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. అధికారుల వేధింపులు పదోన్నతులలో అక్రమాలు జరిగాయంటూ తమ దృష్టికి వచ్చిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ త్వరలోనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. క్లాస్ ఫోర్త్ భవనం ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం కూడా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి మినీకే రాజ్ కుమార్ తో కలిసి నాలుగో తరగతి ఉద్యోగులు రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి రిజ్వాన్ అలీ, సహాధ్యక్షులు పోచయ్య, కార్యవర్గ సభ్యులు ప్రసన్న, స్వప్న, ఝాన్సీ, ప్రతాప్, హైమద్, శకుంతల, టీఎన్జీవో నాయకులు అనురాధ, ఇక్బాల్ పాషా, పజాలుద్దీన్, రఘునాథరావు, లీల, శివాజీ, కిరణ్, రాధా, విష్ణువర్ధన్ రెడ్డి, సతీష్, సంతోష్, శ్రీకాంత్ తదితర ఉద్యోగులు ఉన్నారు.


