చున్నితో ఉరివేసుకొని వివాహిత మహిళ ...
By Prajaswaram
On
చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 26 ( ప్రజాస్వరం ):
చిన్న శంకరంపేట మండలంలో జాల శ్రీలత (30)అనే వివాహిత మహిళ తన ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతూరు గ్రామానికి చెందిన సుంకరి సిద్దయ్య తన కూతురు శ్రీలతను 9 సంవత్సరాల క్రితం చిన్న శంకరంపేట గ్రామానికి చెందిన జాల సునీల్ కు ఇచ్చి వివాహం జరిపించారు, వారికి ఇద్దరు సంతానం ఉన్నట్లు తెలిపారు, నేడు మధ్యాహ్నం శ్రీలత వారి ఇంట్లో చున్ని తో ఉరివేసుకొని చనిపోవడం జరిగిందని మృతురాలి తండ్రి సిద్దయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Latest News
26 Feb 2026 22:08:51
మేడ్చల్, ఫిబ్రవరి 26 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్ పూర్ 23 వ వార్డు అంధకారంలో మగ్గుతోంది. 23 వ వార్డు


