రామాయపల్లి ఇందుస్ మెడికర్ లో రోడ్డు భద్రత పై అవగాహన...

రామాయపల్లి ఇందుస్ మెడికర్ లో రోడ్డు భద్రత పై అవగాహన...

తూప్రాన్, ఫిబ్రవరి 26 (ప్రజాస్వరం ):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లోని రామాయిపల్లి గ్రామంలోని ఇండస్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రోడ్డు భద్రత వారోచ్చాహల లో భాగంగా కంపెనీ సిబ్బంది కార్మికులు రోడ్డు భద్రత పై అవగాహన నిర్వహించారు .

ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించడం, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే పలు అంశాలపై అవగాహన కల్పించిన తూప్రాన్ సిఐ రంగా కృష్ణ మాట్లాడుతు ప్రమాదం పొంచి ఉన్నా ఆశ్రధగా వాహనాలు నడిపిస్తు ప్రమాదలకు గురైతున్నారని ఆయన అన్నారు 

ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. “Arrive and Alive” కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ముఖ్య లక్ష్యమని ఎసై సుభాష్ గౌడ్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి సంస్థ ప్రతినిధులు మరియు సిబ్బంది కార్మికులు సహకారం అందించారు.