వెలగని వీధి దీపాలు...

వెలగని వీధి దీపాలు...

 

మేడ్చల్, ఫిబ్రవరి 26 (ప్రజాస్వరం):

మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపల్  

పరిధిలోని డబిల్ పూర్ 23 వ వార్డు అంధకారంలో మగ్గుతోంది. 23 వ వార్డు లో గత వారం రోజులుగా వీధి లైట్లు రాకపోయినా పట్టించుకున్న నాథుడే లేరని కాలనీవాసులు పేర్కొంటున్నారు. కాలనీలో వీధి దీపాలు వెలగక దాదాపు వారం రోజులు గడుస్తున్నా మున్సిపల్ సిబ్బంది అటు వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని ఆరోపించారు.వార్డులో వీధి దీపాల సమస్య ఉందని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, కాలనీవాసులు వాపోతున్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు దృష్టి సారించి వీధి దీపాల సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.