అక్రమనకు గురవుతున్న చెరువులను కాపాడండి...
తహశీల్దార్ వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు...
చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 26 ( ప్రజాస్వరం):
అక్రమనకు గురవుతున్న చెరువులను కుంటలను కాపాడాలని గురువారం కాజాపూర్ రైతులు తాసిల్దార్ మాలతికి వినతి పత్రాన్నిఅందజేశారు మండల పరిధిలోని ఖాజాపూర్ గ్రామ శివారులోని స్టీల్ పరిశ్రమ యజమాన్యం గ్రామ శివారులోని కుంటల్లో చెరువులో మట్టి తో పాటు డస్ట్ నింపి ఆక్రమించుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు కుంటల కట్టు కాల్వలను అలుగులను ధ్వంసం చేశారని తెలిపారు అంజిరెడ్డి చెరువు పట్రేనుకుంటా జేజేలుకుంట మహమ్మదీలకుంట లంబడోని కుంటలలో మట్టి డస్ట్ నింపారని ఫిర్యాదులో తెలిపారు ఇట్టి విషయాన్ని పరిశ్రమ యజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదన్నారు పరిశ్రమ నుండి విపరీతంగా క్యాల్షియం వెదజల్లుతుందన్నారు అక్రమనకు గురవుతున్న చెరువులను కుంటలను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అక్బర్, వినయ్ గౌడ్, స్వామి, రైతులు ఉన్నారు


