చెరువు కుంటలను పరిశీలించిన తహసిల్దార్ మాలతి...
చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 28 ( ప్రజాస్వరం):
చిన్నశంకరపేట మండలంలోని ఖాజాపూర్ గ్రామ శివారులోని కావేరి ఐరన్ పరిశ్రమ యాజమాన్యం చెరువులు కుంటలను ఆక్రమించి కంపెనీ నుండి వచ్చే డస్టును చెరువు కుంటల్లో నింపేస్తున్నారని గ్రామ ప్రజల ఫిర్యాదు మేరకు శనివారం మండల తాసిల్దార్ మాలతి ఖాజాపూర్ గ్రామ శివారులోని చెరువు కుంటలను పరిశీలించి చెరువు శిఖoలో పరిశ్రమ యాజమాన్యం పోసిన డస్టును వెంటనే తొలగించాలని తహసిల్దార్ పరిశ్రమ యాజమాన్యానికి సూచించారు, ఖాజాపూర్ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు పరిశ్రమ కాలుష్యంతో తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని చాలా ఇబ్బందుల గురవుతున్నట్లు హైకోర్టును ఆశ్రయించడంతో తహసిల్దార్ మాలతి పరిశ్రమ సమీపంలోని కుంటలను పరిశీలించారు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు,ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెరువు ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్లలో ఆక్రమణకు గురైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు, చెరువు శిఖంలో వేసిన డస్టును వారం రోజుల్లో తొలగించాలని పరిశ్రమ యజమాన్యాని ఆదేశించారు, ఇట్టి విషయం హైకోర్టులో ఉన్నందున నివేదికను ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందన్నారు, పరిశ్రమ నుండి వెలువడుతున్న కాలుష్యం వల్ల పంటపొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు, చెరువులు కుంటలు కబ్జా విషయంలో సంబంధిత ఇరిగేషన్ అధికారులతో సర్వే నిర్వహించి, కాలుష్యంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారతో కలిసి మరోసారి తనిఖీ చేసే పూర్తి నివేదికను హైకోర్టు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజు, పరిశ్రమ సిబ్బంది, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు


