కాంగ్రెస్ కు జిల్లా పోలీస్ యంత్రాంగం కీలు బొమ్మగా మారింది.....
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్,యం. పద్మదేవేందర్ రెడ్డి....
రాజకీయ కక్ష సాధింపు లో భాగంగా అక్రమ కేసులు నమోదు...మాజీ మున్సిపల్ మల్లిఖార్జున్ గౌడ్ అరెస్ట్ అప్రజాస్వామికం.....
మెదక్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం):
కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడి అక్రమ కేసులు పెడితే భయపడేది లేదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి హెచ్చరించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన చివరికి న్యాయస్థానంలో న్యాయమే గెలిచింది అని అన్నారు. మెదక్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పైపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల మద్దతు బిఆర్ఎస్ పార్టీకి ఉందని రాజకీయంగా ఎదుర్కోలేకనే పోలీసులను అడ్డము పెట్టుకొని ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడి అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. మల్లికార్జున గౌడ్ ని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటివి కక్ష సాధింపు చర్యలకు పూనుకొని ఎన్నో కొత్త కేసులు పెట్టి శనివారం ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మను, భార్యను పిల్లలను పోలీసులు భయభ్రాంతులకు గురిచేసి మల్లికార్జున గౌడ్ ను అక్రమంగా అరెస్టు చేసి మెదక్ రూరల్ పోలీసు స్టేషన్ కు తరలించడంపై పోలీసులపై మండిపడ్డారు. హైదరాబాదులో రేవంత్ రెడ్డి మెదక్లో ఎమ్మెల్యే అదే మాటలు కక్ష సాధింపు కేసులు పెడుతున్నారని, ఎక్కడ న్యాయం ఎక్కడ పోలీస్ వాళ్ళకు చట్టం కాదని కేసులు పెడుతున్నారు. ఎస్సీ ఎస్టీలపై కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం విడ్డూరంగా ఉంది అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేశారు ఆయన ఒక కేసు పెట్టలేరు పోలీసులు, సైలెంట్ పీరియడ్లో ప్రచారం చేశారు, డబ్బులు పంచిన పట్టించుకోని పోలీసులు. అదే అధికార పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరిని చూపించిన కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ నాయకుల పై అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన చివరిగా న్యాయస్థానంలో న్యాయమే గెలిచింది హైకోర్టు స్టే ఇచ్చి వేలు మంజూరు చేసిందని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులకు కంప్లైంట్ చేసిన సాక్ష్యాలు చూపించిన కేసులు బుక్ చేయడం లేదని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యే నాయకులు కేసులు పెడుతున్నారు, ప్రతిసారి న్యాయం కోసం న్యాయస్థానం వెళ్తున్నాము అక్కడ గెలుస్తున్నామని అన్నారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తలు కంటే ఎక్కువగా పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ అంటే కాంగ్రెస్ పార్టీ స్టేషన్గా మారిందన్నారు.అభం శుభం తెలియని మా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తే మేమే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎఫ్ ఐ ఆర్ చేయడం లేదన్నారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోమెదక్ పట్టణంలోఎన్నికల కోడ్ ఉల్లంఘణ జరిగిందన్నారు. అయినప్పటికీ వారి పైన పోలీసులు కేసులు పెట్టడం లేదు అన్నారు.పోలీస్ స్టేషన్ లు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయలుగా మారాయని ఆరోపించారు.
అనంతరం న్యాయవాది బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ... పోలీసు వాళ్ళు కాంగ్రెస్ నాయకుల్లాగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తెల్లవారుజామున మల్లికార్జున్ గౌడ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పిన వారి పైన పోలీసులు కేసులు పెడుతూ ఇష్టరితిగా ప్రవర్తించడం దారుణం అన్నారు. హై కోర్ట్ స్టే ఇచ్చిన వ్యక్తలను అరెస్ట్ చేయరాదు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నప్పటికీ,పోలీసులు అత్యుత్సాహం చూయించి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే చెప్పనా మాటలు విని మల్లికార్జున్ గౌడ్ ను అరెస్ట్ చేశారు. దానికి తగిన మూల్యం భవిష్యత్తు లో పోలీసులు చెలించక తప్పదాని హెచ్చరించారు.రాజకీయ ఒత్తిడిలకు లోనైచట్టాన్ని అతిక్రమించి కేసులు పెడితే పోలీసుల బాధ్యులవుతారని అన్నారు. ఈ విషయంలో హెచ్ఆర్సీకి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు న్యాయస్థానానికి వెళ్తామన్నారు.అనంతరం మాజీ మున్సిపల్ చైర్మెన్ ఆరేళ్ళ మల్లిఖార్జున్ గౌడ్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వేలువడినప్పటి నుంచి నేటి వరకు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే కుట్రపన్ని అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ పట్టణ సిబ్బంది పట్టణ సీఐ తన సిబ్బందితో వచ్చి ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పకుండా తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ అరెస్ట్ చేశారాని తెలిపారు.అక్రమ కేసులు పెట్టిన వారిని న్యాయస్థానానికి ఈడుస్తామన్నారు.
మల్లిఖార్జున్ గౌడ్ పై నమెదు అయిన కేసును సీనియర్ న్యాయవాధులు మాదవరెడ్డి దేవేందర్ రెడ్డి, జీవన్ రావు, మాయా వెంకటేశం, ప్రశాంత్, చిరంజీవి,సుధాకర్, ఇప్ప సాయి కుమార్, మల్లూరి రాకేశ్ లు మల్లిఖార్జున్ గౌడ్ తరుపున న్యాయస్థానంకు వాదనలు వినిపించడం జరిగింది.అనంతరం మల్లిఖార్జున్ గౌడ్ కు బెయిల్ మంజూరు చేశారు.ఈ సందర్బంగా మెదక్ పట్టణ,మండల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోర్టు వద్దకు చేరుకొని మల్లికార్జున్ గౌడ్ కు మద్దతుగా నిలిచారు.మల్లికార్జున్ గౌడ్ బెయిల్ మంజూరు కావడంతో హర్షం వ్యక్తం చేశారు.


