పేద ప్రజల హామీలను నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం
మేడ్చల్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం):
పేద ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎల్లంపేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు అక్బర్జపేట్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా గృహ నిర్మాణం చేసుకున్నటువంటి మాసబోయిన వెంకటేష్ నాగరాణిల ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని ఎల్లంపేట మున్సిపాలిటీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రాజ బొల్లారం పాషా ఆధ్వర్యంలో నాయకులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. పేదలకు సుపరిపాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని, ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. లబ్ధిదారులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా తమ గృహ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మాలోత్ శాంతి రాజు నాయక్, పార్వతీ తారయ్య, విగ్నేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్ ముదిరాజ్, బాలేష్ యాదవ్, ప్రదీప్ రెడ్డి, రాజ బొల్లారం పాషా, మహంకాళి సురేష్, రఘురాం రెడ్డి, రెడ్డిపల్లి వెంకటేష్, సాయి, నాయకులు గుంటి రవి, గుంటి నరేష్, నాగేష్ గౌడ్, రాము, బాలరాజ్ నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..


