సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వార్షిక క్రీడా పోటీలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వార్షిక క్రీడా పోటీలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్

సిద్దిపేట (ప్రజాస్వరం) :

 

స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వార్షిక క్రీడా పోటీలను పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం  క్రీడలను ఉద్దేశించి ప్రసంగించారు.
 ఇటీవల జరిగిన 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడల్లో సిద్దిపేట కమిషనరేట్ పోలీసులు అద్భుత ప్రతిభ కనబరిచిందని కమిషనర్ ప్రశంసించారు.ఈ పోటీల్లో మన సిద్దిపేట విభాగంలో :3 బంగారు పతకాలు,2 వెండి పతకాలు. 7 కాంస్య పతకాలు
మొత్తం 12 పతకాలను సాధించి కమిషనరేట్ కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటిన విజేతలను  ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.నిరంతరం విధులతో ఒత్తిడికి గురయ్యే పోలీస్ సిబ్బందికి క్రీడలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని తెలిపారు. క్రీడల వల్ల తోటి సిబ్బందిలో స్ఫూర్తిని నింపుతాయని, మైదానంలో ఆడే శారీరక క్రీడలు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అధికారులు మరియు సిబ్బంది సమయాన్ని వృథా చేసే, ఆర్థికంగా నష్టపరిచే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకర్షితులు కావద్దని, అటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని  సూచించారు. క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చాటాలని ఆకాంక్షిస్తూ, క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపి పోటీలను అధికారికంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, అదనపు డీసీపీ ఎఆర్ సుభాష్ చంద్రబోస్, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు... మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు...
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ గడి మైసమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు...
రైతులకు 12 గంటల వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలి....
ఆర్యవైశ్య సంఘం సామాజిక సేవ అభినందనీయం...
భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా గున్న సంధ్య...
ఇంకా పురుగుల మందు తాగలేదా.. బ్రతికే ఉన్నావా?”
బాలమ్మ సేవలను ఆదర్శంగా తీసుకోవాలి....
ఘనంగా గాయత్రోత్సవ్ 2 కే 26  ....