సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, ఎమ్మెల్యే రోహిత్ చిత్రపటాలకు పాలాభిషేకం.....

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, ఎమ్మెల్యే రోహిత్ చిత్రపటాలకు పాలాభిషేకం.....

ప్రజాస్వరం : మెదక్ ,మే 22 :

 

రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు కనీస వేతనం 20 వేలు గా తీసుకున్న నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తా లో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సీఎం, కార్మిక శాఖ మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఈ నిర్ణయం వల్ల మేలు చేకూరుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ఈ నిర్ణయం ద్వారా మరోసారి నిరూపించడం జరిగిందని అన్నారు. కార్మికులకు కనీస వేతనం 20 వేలు నిర్ణయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించినందుకు కార్మికుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్స్ శివరామకృష్ణ, కో ఆప్షన్ సభ్యులు తాహెర్, కొరివి రాములు, నాయకులు భూపతిరాజు, ఉమర్, ముజమ్మిల్ తదితరులు పాల్గొన్నారు.

Latest News