ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం.....

జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు....

ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం.....

సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి.....

ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మెదక్ జిల్లా ఎస్పీ...  

 

ప్రజాస్వరం: మెదక్, మే 18  : 

 

 

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారునితో స్వయంగా మాట్లాడి సమస్యల వివరాలు తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత సీఐలు, ఎస్‌ఐలకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ఫిర్యాదులపై సంబంధిత ఎస్‌హెచ్‌వోలతో ఫోన్‌లో మాట్లాడి వేగంగా స్పందించాలని సూచించారు. ప్రజలకు న్యాయం చేయడంలో పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని ఎస్పీ తెలిపారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు. చట్ట ప్రకారం ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం అందిస్తామని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయని, ప్రజల్లో పోలీస్ శాఖ పై విశ్వాసం పెరుగుతోందని తెలిపారు.

Latest News

ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం..... ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం.....
సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి..... ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మెదక్ జిల్లా ఎస్పీ...     ప్రజాస్వరం: మెదక్, మే 18  :      మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం...
రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు....
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి.... 
మేడ్చల్ లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి...
ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ హైపర్ టెన్షన్ డే.... 
ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య కళాశాల విద్యార్థుల ప్రభంజనం....
సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.....