ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ హైపర్ టెన్షన్ డే.... 

ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ హైపర్ టెన్షన్ డే.... 

ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 18 : 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అధిక రక్తపోటు దినోత్సవ ర్యాలీ నిర్వహించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అధిక రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ జనేశ్వర్ డిప్యూటీ DMHO PO NCD మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 30 సంవత్సరాలు పైబడిన వారు 3,86,83 మంది ఉండగా అందులో అధిక రక్తపోటు వార 1,07,999 మరియు 53,995 మంది మధుమేహం (చక్కర వ్యాధితో) బాధపడుతూ ఉన్నారు. అందులో 70% వారికి వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల మన జిల్లాలో మొత్తం 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 3 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఒక జిల్లా ఆసుపత్రితో పాటు గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు ఉచితంగా మందులు అందజేస్తున్నామని ఆయన అన్నారు PHC లో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది మిగిలిన 30% కూడా ప్రభుత్వ పరిధిలో చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాము వీటితోపాటు ప్రతి ఒక్కరు వారి జీవనశైలి మార్చుకోవాలి అనగా యోగ మెడిటేషన్ తో పాటు ధూమపానం మద్యపానం నాకు దూరంగా ఉండటం జంక్ ఫుడ్ కూడా చాలావరకు నివారించుకోవచ్చును మరియు 14 - 15 సంవత్సరాల వయసు బాలికలకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా గర్భశయ muka ద్వారానికి క్యాన్సర్ (సర్వికల్) రాకుండా HPV వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రతి బాలిక వ్యాక్సినేషన్ చేయించుకొని సర్వికల్ క్యాన్సర్ బారిన పడకుండా నివారించుకుందాం.అని అయన పేర్కొన్నారు .CHC సూపర్ ఇండెంట్ డాక్టర్ అమర్ సింగ్ మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉండటం వలన ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని ఆయన సూచించారు అవసరముంది వెళ్లినచో తలను కాటన్ బట్టతో కవర్ చేసుకొని ఉండాలని ఆయన కోరారు అన్ని సిహెచ్ పిహెచ్సిలో సబ్ సెంటర్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ అందుబాటులో ఉన్నదని తెలియజేశారు సమావేశంలో పీహెచ్సీ మనోహరాబాద్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్

 కే బాల నర్సయ్య గారు

డిప్యూటీ DMHO స్టాఫ్ 

సిహెచ్ సి స్టాప్ అందరు పాల్గొనడం జరిగింది.

Latest News

ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం..... ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం.....
సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి..... ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మెదక్ జిల్లా ఎస్పీ...     ప్రజాస్వరం: మెదక్, మే 18  :      మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం...
రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు....
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి.... 
మేడ్చల్ లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి...
ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ హైపర్ టెన్షన్ డే.... 
ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య కళాశాల విద్యార్థుల ప్రభంజనం....
సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.....