అక్రమ గోవుల తరలింపును అడ్డుకున్న గోరక్షక్ కార్యకర్తలు ....
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్, మే 16 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
జాతీయ రహదారి పై ఆవుల తో వెళుతున్నా పట్టుకున్న గో రక్ష దళం లారీని సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి పోలీసులు.అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని గోరక్షక్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శనివారం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు తరలిస్తున్న గోవులను మాసాయిపేట మండలం రామంతాపూర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలోని డబ్బా వద్ద ముందస్తు సమాచారం తో గోరక్షక్ కార్యకర్తలు అడ్డగించారు.సమాచారం అందుకున్న చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న సుమారు 30 గోవులను సురక్షితంగా గోశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Latest News
17 May 2026 14:10:58
ప్రజాస్వరం : మేడ్చల్ : మే 17 : మేడ్చల్ జిల్లా సైబరాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ లోని గౌడవెళ్లి లో...


