జాతీయ డెంగ్యూ డే -ర్యాలీ ...
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 16 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డెంగ్యూ దినోత్సవం సందర్బంగా ఆసుపత్రి సూపర్ డెంట్ డాక్టర్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు డాక్టర్ అమర్ సింగ్ మాట్లాడుతూ....భారతదేశంలో ప్రతి సంవత్సరం మే 16వ తేదీని జాతీయ డెంగ్యూ దినోత్సవం గా పాటిస్తాం అని డెంగ్యూ జ్వరంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కోసమే ర్యాలీ ముఖ్య ఉద్దేశం. పరిసరాల పరిశుభ్రత ఉండి దోమల అభివృద్ధి లేకుండా చూడాలన్నారు.
_డెంగ్యూ నివారణ: సురక్షితమైన రేపటి కోసం మన బాధ్యత_ఏడిస్ ఈజిప్టై అనే దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఈ దోమ పగటిపూట కుడుతుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కీళ్ల నొప్పులు, ఒంటిపై దద్దుర్లు, వాంతులు. ఉన్నపుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు.ప్లేట్‌లెట్స్ పడిపోయి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ వస్తే ప్రాణాపాయం.ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దోమలు వృద్ధి చెందకుండా చూడాలి నీరు నిలవనివ్వద్ద : కూలర్లు, పూల కుండీలు, టైర్లు, కొబ్బరి చిప్పల్లో వారం వారం నీళ్లు పారబోయాలి ఆయన సూచించారు.ఉచిత రక్త పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగ్యూ టెస్ట్ ఉచితం వర్షాకాలం ముందు మే-జూన్‌లో కేసులు పెరుగుతాయి.అని అన్నారు.డెంగ్యూకు స్పెసిఫిక్ మందు లేదు.పారాసెట్ మాల్ మాత్రమే వాడాలి. ఆస్పిరిన్, బ్రూఫెన్ లాంటివి వాడకూడదు. కొబ్బరి నీళ్లు, బొప్పాయి ఆకు రసం తాగితే ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి అని డాక్టర్లు చెబుతారు. ఏదైనా సందేహం ఉంటే ఆరోగ్య సిబ్బందిని కలవండి.డాక్టర్ తెలిపారు తూప్రాన్ సి హెచ్ సి నందు నిర్వహించడం జరిగింది.
తూప్రాన్ సూపరిండెంట్ డాక్టర్ అమీర్ సింగ్
సిబ్బంది కుమార్ రేడియాలజిస్ట్
డిప్యూటీ డిఎంహెచ్ఓ సిబ్బంది
పిహెచ్సి మనోహరాబాద్ సిబ్బంది
కే బాల నరసయ్య సిహెచ్ఓ
డాక్టర్ కి పద్మ కుమారి
శ్యామల ఏఎన్ఎం
హెల్త్ అసిస్టెంట్ దుర్గారెడ్డి
పాల్గొన్నారు.


