సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.....

విల్లా యజమానులు....

సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.....

ప్రజాస్వరం : మేడ్చల్ : మే 17 :

 

మేడ్చల్ జిల్లా సైబరాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ లోని గౌడవెళ్లి లో విల్లా యజమానుల ఆస్తులను ,ఖాళీ స్థలాలను వారి అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా విల్లా లను తాకట్టు పెట్టిన సాకేత్ ఇంజనీర్స్ ప్రేవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు రాధాకృష్ణ, రవి లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విల్లాల యజమానులు మేడ్చల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసి ప్లకార్డు లతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టు ను పూర్తి చేయకపోవడమే కాకుండా డైరెక్టర్లు రాధాకృష్ణ ,రవి లు విస్ట్రా ఐటీసీఎల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో కుమ్మక్కై భారీ మొత్తంలో సమన్వయం తో కూడిన ఆర్థిక మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదు లో పేర్కొన్నట్లు వారు తెలిపారు.

రూపాయి రూపాయి కూడబెట్టుకొని కొందరు, సొంత ఊళ్లలోని స్థలాలను విక్రయించగా వచ్చిన సొమ్ముతో మరికొందరు, వివిధ ఉద్యోగాలు, ఉపాధి ద్వారా సొంతింటికల నెరవేర్చుకున్నామని, ఇప్పుడు సాకేత్ యాజమాన్యం చేసిన మోసంతో తమ జీవితాలకు భరోసా కరువైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కొనుక్కోని రిజిస్టర్ చేసుకున్న తమ ఇళ్లపై, తమకు తెలియకుండా లోన్లు ఎలా తీసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మోసానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

Latest News

సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..... సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.....
ప్రజాస్వరం : మేడ్చల్ : మే 17 :   మేడ్చల్ జిల్లా సైబరాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ లోని గౌడవెళ్లి లో...
జాతీయ డెంగ్యూ డే -ర్యాలీ ...
అక్రమ గోవుల తరలింపును అడ్డుకున్న గోరక్షక్ కార్యకర్తలు ....
రైస్ మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలి.... 
చెరువు కట్ట శ్రీ విరాంజనేయ స్వామి ఆలయంలో శని అమావాస్య శనీశ్వర స్వామి పూజ ....
మున్సిపల్ లో నీటి ఎద్దడి నివారణ కోసం బడ్జెట్ తీర్మానం ....
వరి ధాన్యం నిల్వ ప్రక్రియ సక్రమంగా చేపట్టాలి....