విద్యార్థుల్లో క్రమశిక్షణ – సంస్కారం పెంపొందించాలి....

జిల్లా పరిషత్ సీఈఓ సి.హెచ్. ఎల్లయ్య....

విద్యార్థుల్లో క్రమశిక్షణ – సంస్కారం పెంపొందించాలి....

ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 12 : 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మండలం ఘనపూర్ పి.ఎం.శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును మెదక్ జిల్లా పరిషత్ సీఈఓ మరియు తూప్రాన్ మండల పరిషత్ ప్రత్యేక అధికారి శ్రీ సి.హెచ్. ఎల్లయ్య గారు ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమయాన్ని వృథా చేయకుండా విద్యార్థులు తమలోని ప్రతిభను వెలికితీసుకునే అవకాశంగా సమ్మర క్యాంపును భావించాలనిఆయన అన్నారు. మంచి విద్యతో పాటు క్రమశిక్షణ, సంస్కారం, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యతా భావం కూడా విద్యార్థులకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా కళలు, క్రీడలు, యోగ, సంభాషణా నైపుణ్యాలు వంటి అంశాల్లో కూడా అభివృద్ధి చెందాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే చిన్ననాటి నుంచే పట్టుదల, ఆత్మవిశ్వాసం, సమయపాలన అలవర్చుకోవాలని హితవు పలికారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు సత్ప్రవర్తనతో ముందుకు సాగాలనిఎల్లయ్య అన్నారు.తెలంగాణ విద్యాశాఖ ఆదేశాల మేరకు వేసవి సెలవుల్లో విద్యార్థుల మానసికోల్లాసం, సృజనాత్మకత పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి డా. పర్వతి సత్యనారాయణ తెలిపారు. ఈ క్యాంపులో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యోగ, డాన్స్, ఇండోర్ గేమ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ కె. శ్రీనివాస్, ఏఏపీసీ చైర్‌పర్సన్ శ్రీమతి ఓ. కరుణశ్రీ, ఉపాధ్యాయులు, శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సమ్మర్ క్యాంపు ప్రారంభోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో ఏర్పాటు చేశారు.

Latest News

రోడ్డెక్కిన రైతులు.... రోడ్డెక్కిన రైతులు....
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం..  లారీలు పంపాలని రైతుల డిమాండ్...   ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 13 :  పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి        మెదక్ జిల్లా చేగుంట మండలం...
దొంగగా మారిన బ్యాంకు మేనేజర్ ....
తూప్రాన్ సిఐగా వెంకట్రాజ్ గౌడ్ ....
విద్యార్థుల్లో క్రమశిక్షణ – సంస్కారం పెంపొందించాలి....
నిరక్షరాస్యత నిర్మూలన అమ్మకు అక్షరమాల ...
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు....
ఘనంగా ఇంటర్నేషనల్ నర్సింగ్ డే వేడుకలు ....