రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు..

నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి...

రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు..

 

 

 

 

ప్రజాస్వరం  : తూప్రాన్, మే 11 :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

శివ్వంపేట మండల కేంద్రం లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులైన ముద్దగల్ల కవిత – నరేష్ దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం లో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన ఇంటిని ప్రారంభించారు. అనంతరం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ పథకం ద్వారా సొంత ఇంటి కలను సాకారం చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనిరాజిరెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవీన్ గుప్తా, వెల్దుర్తి మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, ఎఫ్‌జెడ్పీటీసీలు లక్ష్మీకాంతరావు, కమలాపూర్ సింగ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మురళి గౌడ్, దొంతి ఉపసర్పంచ్ శ్రీనివాస్, పీఎసీఎస్ డైరెక్టర్ వీరస్వామి, వరల గణేష్, బిచ్కుందు అంజయ్య, బీజీ పురం సత్తయ్య, ప్రభులింగం గౌడ్, వెతుకు మల్లేష్, దావూద్, కమలయ్య, వెంకటేష్, వజ్జ నాగేష్, వజ్జ శ్రీనివాస్, వార్డు సభ్యులు ఈసరపు రాజు, కోల కిషన్, దేవునిబోయిన కృష్ణ, సద్దాం, సోను, అంజి, సల్మాన్, కుమ్మరి హనుమంతు, గొల్ల యాదయ్య, గొల్ల మహేష్ తదితరులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.