యావపూర్ లో రైతు అవగహన సదస్సు.....

యావపూర్ లో రైతు అవగహన సదస్సు.....

ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 9 : 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు తూప్రాన్ మండల పరిధిలో ఉన్న ఐకెపి సెంటర్లు మరియు రైస్ మిల్లులు తనిఖీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం యావాపూర్ గ్రామంలో రైతు అవగాహన సదస్సులో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కార్యక్రమం లో తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి హాజరై . రైస్ మిల్లు యాజమాన్యంతో మాట్లాడి రైస్ మిల్క్ వచ్చిన ధాన్యాన్ని త్వరగా లారీల నుండి ఖాళీ చేయించాలని ఆదేశించడం జరిగింది. అలాగే ఐకెపి మరియు పిఎసిఎస్ సెంటర్లలో రైతులతోని మాట్లాడి వర్షాలు ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు తెలియజేసిన తహసీల్దార్ మరియు ప్రతి రైతు నుండి వడ్లు కొనుగోలు చేస్తాము అనిఆయన తెలియజేశారు. ఎవరు కూడా అధైర్య పడొద్దు అని ఆయనపేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యంజాల కీర్తన విఠల్ రెడ్డి ,వైస్ చైర్మన్ మామిండ్ల కృష్ణ, సర్పంచ్ యంజాల స్వామి తదితరులు పాల్గొన్నారు...