దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే మోడీ లక్ష్యం....

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే మోడీ లక్ష్యం....

ప్రజాస్వరం : మెదక్, మే 11 : 


భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉంచే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో జరిగిన సభలో పది అంశాలను తీసుకురావడం జరిగిందనీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ రాధా మల్లేశం గౌడ్ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ లో దేశ ప్రజల కోసం తెలిపిన పది అంశాలను ప్రతి ఒక్కరికీ వివరించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల పై ఉందని అన్నారు. నరేంద్ర మోడీ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ, నాయకులు నాగరాజు, విజయ్, కాశీనాథ్, గుండు మల్లేశం, లోకేష్, మధు తదితరులు పాల్గొన్నారు.