మేడ్చల్ లో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం....

మేడ్చల్ లో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం....

ప్రజాస్వరం : మేడ్చల్ , ఏప్రిల్ 28

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ లో ఐకేపీ (IKP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్ ,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి లు ప్రారంభించారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా తమ పంటను విక్రయించుకోవడం వల్ల నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయని పేర్కొన్నారు..మేడ్చల్ మరియు ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిసర గ్రామాల రైతులకు ఈ కొనుగోలు కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని,సమయానికి ధాన్యం కొనుగోలు జరిగేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.రైతులు తమ వరి ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రపరచి తీసుకురావాలని సూచించారు.వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని,రైతుల సంక్షేమం కోసం ఇలాంటి కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని తెలిపారు..ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి,అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రేగు రాజు కురుమ,తుంకి భిక్షపతి,మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు నడికొప్పు నాగరాజు (చాపరాజు) ముదిరాజ్,కౌడే మహేష్ కురుమ,మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణా రెడ్డి,పిఏసిఎస్ మాజీ చైర్మన్ అంతిరెడ్డి,మాజీ డైరెక్టర్లు మెట్టు వెంకట్ రాంరెడ్డి,సత్యనారాయణ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు నడికొప్పు రంజిత్ ముదిరాజ్,కాలేరు శ్రీకాంత్ వంజరి,వేముల రంజిత్ రెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు,ఐకేపీ సిబ్బంది,వ్యవసాయ శాఖ అధికారులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest News

రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు.... రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు....
ప్రజాస్వరం  : జగదేవ్ పూర్,ఏప్రిల్ 28    ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు సరైన మద్దతు ధర లభిస్తుందని, కావున రైతులందరూ ఈ కేంద్రాలను సద్వినియోగం...
మేడ్చల్ లో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం....
బాలల రక్షణకు చట్టాలు....
బాల్య వివాహాల నిర్ములన పై అవగాహనా.... 
నీటి సమస్య తీర్చేందుకు నూతన బోరు....
మేడ్చల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)ను ఆకస్మికంగా తనిఖీ....
కేంద్రంప్రభుత్వం స్వయంగా జన గణన నమోదు..