మేడ్చల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)ను ఆకస్మికంగా తనిఖీ....

జిల్లా కలెక్టర్ మను చౌదరి....

మేడ్చల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)ను ఆకస్మికంగా తనిఖీ....

ప్రజాస్వరం : మేడ్చల్ , ఏప్రిల్ 27

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి సోమవారం మేడ్చల్ పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, వైద్య సేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజూ ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు, మెడిసిన్ స్టోరేజ్ ఏరియాను తనిఖీ చేసిన కలెక్టర్, అక్కడ ఉన్న మందుల నిల్వలను పరిశీలించారు. ముఖ్యంగా ట్యాబ్లెట్ల గడువు ముగిసే తేదీలను స్వయంగా తనిఖీ చేసి, నాణ్యమైన మందులు మాత్రమే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు, ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి వారికి కావాల్సిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మరియు సిబ్బందికి ఉపయోగపడే విధంగా అదనపు వాష్‌రూమ్ (Washroom) సౌకర్యం కల్పించాలని సిబ్బంది కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రతిపాదనలు పంపాలని, త్వరలోనే వాష్‌రూమ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట డిప్యూటీ తహసీల్దార్ అనూష, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.