రోడ్డు నియమాలు పాటించండి - ప్రమాదాలను నివారించండి....

సర్పంచ్.....

రోడ్డు నియమాలు పాటించండి - ప్రమాదాలను నివారించండి....

జగదేవ్ పూర్, ఏప్రిల్ 13, (ప్రజాస్వరం ):

 

జగదేవ్‌పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో సర్పంచ్ విద్యాధర్, ఉపసర్పంచ్ నాగరాజు అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్లపై అతివేగంతో వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాను, ఎఫ్ఏ రమేష్, అమరేందర్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పాలకవర్గ సభ్యులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest News

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.....
మాసాయిపేట, ఏప్రిల్ 13 (ప్రజాస్వరం) :   మాసాయిపేట మండలంలోని చెట్లతిమ్మాయిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక వివిధ గ్రామాల సర్పంచ్...
రోడ్డు నియమాలు పాటించండి - ప్రమాదాలను నివారించండి....
కొనుగోలు కేంద్రం ఏర్పాటు....
అరైవ్ అలైవ్ కార్యక్రమం....
గ్రామ సభలో రోడ్డు భద్రత పై అవగాహన...
మున్సిపాలిటీలో అంగన్ వాడి టీచర్లకు మొబైల్ లు పంపిణి..
కుల రహిత సమాజాన్ని నిర్మిద్దాం....