వాహనదారులకు టోల్‌షాక్‌.....

వాహనదారులకు టోల్‌షాక్‌.....

 

–పెరిగిన టోల్‌ ధరలు

–వాహనదారులకు మరింత భారం 

 నేటి నుంచి అమల్లోకి...

 

తూప్రాన్‌, ఏప్రిల్ 01 (ప్రజాస్వరం ):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్‌ మండలం అల్లాపూర్‌ శివారులోని 44వ నంబరు జాతీయ రాహదారిపై ఏర్పాటు చేసిన టోల్‌గేట్‌ గుండా ప్రయాణం మరింత భారం అయింది ఇప్పటికే వాహనదారులు టోల్‌ గేట్‌ భారం అధికంగా ఉందని గగ్గోలు పెడుతుండగా, మరోమారు టోల్‌గేట్‌ ద్వారా వేళ్లే వాహనాదారులకు నడ్డి విరిచేందుకు రేట్లు పెంచేశారు.అయితే ప్రతి ఏటా ఏప్రిల్‌ మాసాం మొదటి వారం నుంచి అమల్లోకి ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచేందుకు వీలు కల్పించింది. ఇప్పటికే అధిక ధరలు వసూలు చేస్తుండడంతో పలుమార్లు టోల్‌గేట్‌ వద్ద ధర్నాలు, రాస్తారోకోలు మరియు విధ్వంసానికి సైతం పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. పాత ధరలను చెల్లించలేకే కొందరు వాహనదారులు అల్లాపూర్, ఇమాంపూర్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు పాలాట, శివ్వంపేట మండలం పోతారం గ్రామం మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం టోల్‌గేట్‌ నుంచి 10 నుంచి 12 వేల వరకు వాహనాలు రాక పోకలు సాగిస్తున్నాయి. రోజువారి టోల్‌గేట్‌ రూ. 11లక్షల నుంచి రూ.12 వరకు ఆధాయం ఉంటుంది. పేరిగిన ధరలతో వాహనేదారుల జేబుకు చిల్లు పడనుంది. ప్రతియేటా 15 శాతం రేట్లను పెంచుతూ వస్తున్నారు. టోల్‌ గేట్‌ టాక్స్‌ అమలులో వచ్చిన కొత్త విధానాల సవరణల ప్రాకారం 5 నుంచి 10 శాతం రేట్లు పేంచినట్లు నేషనల్‌ హైవే ఆథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రాజేక్ట్‌ ఆధేశాలు జారీ చేశారు. అలాగే ప్రతి యేటా ఏప్రిల్‌ మాసాం మెదటి రోజు నుంచి సైతం తిరిగి మరింత రేట్లు పెరగనున్నాయి. ఫలితంగా వాహనదారులు స్వంత వాహనాల్లో తిరగడం కష్టాంగా మారనుంది. 44వ జాతీయ రహదారిపై కేంద్రం ఎంత దూరం ప్రయాణిస్తే అంతే దూరం టోల్‌ రుసుం వసూలు చేస్తామని ప్రకటించారు. కాని అది ఇంకా అమల్లోకి రాలేదు. త్వరగా ఆ ఆన్‌లైన్‌ విధానం అమ్మల్లోకి తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే టోల్‌ ప్లాజా సమీప గ్రామాల వాహనదారులకు నెలవారి పాసులు మంజూరు చేశారు. ప్రతి నెల 350 ఉండగా ప్రస్తుతం పెరిగిర ధరలతో రూ.360కి పెంచారు. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.