మెదక్ జిల్లా తూప్రాన్ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ...
సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
హనుమాన్ మాల విరమణ
తూప్రాన్ ఏప్రిల్ 2 (ప్రజాస్వరం):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పెద్ద చెరువు కట్టపై వెలసిన వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హనుమాన్ జయంతి పురస్కరించుకొని మాలాధారణ చేసిన 250 మంది హనుమాన్ మాలధారణ స్వాములతో పాటు వందలాది మంది భక్తులు వ్రత పూజల్లో పాల్గొన్నారు. గత 40 సంవత్సరాలుగా తూప్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయం లో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాట్లు ఆత్రేయ శర్మ పేర్కొన్నారు తెలంగాణ లోనే మరో కొండా గట్టు ఆంజనేయ స్వామి ఆలయం గా ప్రసిద్ధిగాంచిన ఆలయం లో మాలధారణ వేసుకున్నా ఈ ఆలయంలో జయంతి రోజు ఇక్కడే మాల విరమణ సలక ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు భక్తి శ్రద్దల తో ఉండాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని దర్మం న్యాయం వైపు నడవాలని ఆయన కోరారు తూప్రాన్ ఆంజనేయస్వామి ఆలయం చాలా మహిమ గల ఆలయం ఇక్కడ నమ్మకం తో కొలుస్తే కోరికలు తీర్చే హన్మంతుడు సంతానం వివాహాలు వ్యాపార అభివృద్ధి ఉద్యోగం లాంటి కోరికలకు కొలువైన దేవుడు వీరాంజనేయుడు అని ఆయన తెలిపారు. గురువారం ఉదయం ఆంజనేయుస్వామి చందన అభిషేకం , లక్ష ఆకుపూజ లక్ష పుష్పర్చన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అనంతరం మహా అన్నధానం ఏర్పాట్లు చేశారు భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్న భక్తులకు ప్రముఖులకు ఆత్రేయ శర్మ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజనీ రాఘవేందర్ గౌడ్ వైస్ చైర్ పర్సన్ కొక్కొండ సమత కాశిరెడ్డి పాలకవర్గ సభ్యులు అన్నపూర్ణ. జ్యోష్న రాణి. సబితా. జైపాల్ రాథోడ్ చెలిమల రాములు గజ్వేల్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


