చికెన్ వ్యాపారులకు తగ్గించిన కమిషన్ ను పెంచాలి ....

చికెన్ వ్యాపారులకు తగ్గించిన కమిషన్ ను పెంచాలి ....

మెదక్, ఏప్రిల్ 01 (ప్రజాస్వరం):

 

ఫోల్ట్రీ కంపెనీలు చికెన్ దుకాణాల నిర్వాహకులకు తగ్గించిన కమిషన్ సరిచేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కేంద్రం లో చికెన్ దుకాణాలను బుధవారం మూసివేశారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తా వద్ద చికెన్ వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చికెన్ వ్యాపారులకు కమిషన్ సరిపడ ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల చేస్తున్న పౌల్ట్రీ కంపెనీ ఆగడాలకు చికెన్ వ్యాపారులు బలవుతున్నారని అన్నారు. లాభాలు లేక వ్యాపారాలు చేయలేని స్థితికి వెళ్తున్నామని అన్నారు. వెంటనే పౌల్ట్రీ కంపెనీ లు తమ కు తగ్గించిన కమిషన్ ను పెంచి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చికన్ వ్యాపారులు ఇందాద్, నర్సగౌడ్, ఇతియాజ్ అలీ, షఫీ, మురళీధర్ రావు, అనిల్, నాగరాజు, జిత్తు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.