తూప్రాన్ మండలంలోని ప్రాథమిక పాఠశాల రెడ్యానాయక్ తాండ విద్యార్థుల ఘన విజయం

తూప్రాన్ మండలంలోని ప్రాథమిక పాఠశాల రెడ్యానాయక్ తాండ విద్యార్థుల ఘన విజయం

తూప్రాన్, మార్చి  25 (ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 5వ తరగతి గురుకులాల ప్రవేశ పరీక్షలో తూప్రాన్ మండలంలోని ప్రాథమిక పాఠశాల, రెడ్యానాయక్ తాండకు చెందిన విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరచారు. ఈ పరీక్షకు హాజరైన నలుగురు విద్యార్థులు నలుగురూ అర్హత సాధించడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.

 

ఎంపికైన విద్యార్థుల్లో ముగ్గురు తూప్రాన్ టోల్‌గేట్ గురుకుల పాఠశాలకు, మరొకరు దాతర్‌పల్లి రెసిడెన్షియల్ పాఠశాలకు ప్రవేశం పొందారు. ఈ విజయం వెనుక రాష్ట్ర విద్యాశాఖ అందించిన “సాధన గురుకుల ఎంట్రన్స్ ఐటమ్ బ్యాంక్” కీలక పాత్ర పోషించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆర్. సుధాకర్ తెలిపారు.

 

ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆర్. సుధాకర్ గారిని తూప్రాన్ మండల విద్యాధికారి డా. పర్వతి సత్యనారాయణ గారు ప్రత్యేకంగా అభినందించారు.

 

ఈ విజయం ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందుతున్నదనడానికి మరో నిదర్శనంగా నిలిచింది.