వృద్ధ దంపతులను చితకబాది బంగారం దోచుకెళ్లిన దొంగలు...
చిన్న శంకరంపేట ,మార్చి 25 ( ప్రజాస్వరం):
మిట్ట మద్యాహ్నం వేళ వృద్ధులు అని కనికరం లేకుండా ఇంట్లో చోరబడి ఒంటరిగా ఉన్న వృద్ధులపై ద్విచక్రా వాహనం పై వచ్చి రాడ్ తో దాడి చేసి బంగారం ఎత్తుకు వెళ్ళిన ఘటన మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించింది జంగరాయి గ్రామంలో నిఘా నేత్రలు పని చెయ్యడం లేదు. గ్రామంలొ ఎవరు లేరని అదను చూసి దొంగతనానికి పాల్పుడ్డ సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలం లో జంగరాయి గ్రామంలొ చోటు చేసుకుంది.
-చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి గ్రామంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. ఇంట్లోని వారంతా ఒక ఫంక్షన్ కి వెళ్లగా సాలె అంజయ్య, సావిత్రి అనే ఇద్దరు వృద్ధ దంపతులు ఒంటరిగా ఉన్నారు. ఇదే క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడి వృద్ధులపై దాడి చేసి ఒంటిపై ఉన్న సుమారు నాలుగు తులాల బంగారు నగలను ఎత్తుకొని పరారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వృద్ధ దంపతులను స్థానికులు మెదక్ జిల్లా కేంద్ర ములోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు, మండలంలోని పలుచోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు దీంతో మండలంలోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.


