తండ్రి రోడ్డు ప్రమాదం లో ...

కొడుకు పది పరీక్షలకు హాజరు....

తండ్రి రోడ్డు ప్రమాదం లో ...

తూప్రాన్, మార్చ్ 14 (ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా శివ్వం పేట్ మండలం ఉసరిక పల్లి గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో శివ్వం పేట్ మండలం పంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు (45) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసికుంది. 

నేడు రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన తండ్రి అంత్యక్రియలు జరగాల్సి ఉండగా మృతుని కొడుకు తీరని దుఃఖంలో ఏడ్చుకుంటూ కుమ్మరి ధనుష్( 16) 

తూప్రాన్ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరు కావడంతో అందరిని కలచివేస్తుంది. 

తన తండ్రి ఎంతో కష్టపడి తమని చదివిస్తున్నాడని అందుకు తన తండ్రి కష్టం వృధా కాకూడదని ఏడ్చుకుంటూ పరీక్షలకు హాజరైన కుమారుడు ధనుష్ గ్రామం లో విషాదచాయాలు అలుముకున్నాయి.