సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి..

సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి..

నార్సింగి, మార్చ్ 15 ( ప్రజాస్వరం ):

 

రాబోయే మూడు సంవత్సరాలలో జిల్లా లోనే నార్సింగి గ్రామాన్ని అభివృద్ధి లో తొలి స్థానంలో నిలుపుతామని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని 5, 10, 13 వార్డులలో ఎన్ ఆర్ ఈ జీ ఎస్ లో మంజూరు అయిన 25 లక్షల సీసీ రోడ్ల నిర్మాణం పనులకు సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెరుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది నార్సింగి కు దాదాపు 90 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం తో పాటు 96 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పుడు 25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. వంద శాతం సీసీ రోడ్లు నిర్మించి, ఇళ్లు లేని పేదలు లేకుండా రాష్ట్రాన్ని తీర్చి దిద్దడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. గ్రామభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణానికి ఇంకా నిధులు అవసరమున్నాయని, చెరుకు శ్రీనివాస్ రెడ్డి కృషి చేసి నిధులను మంజూరు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి, వార్డు సభ్యులు కందరి నవీన్, జీవిత రాజు, అటో జానీ, కటికే రాజేందర్, ఆకుల నరేష్, బాచి స్వామి, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేశ్ గౌడ్, నాయకులు బక్కన్నగారి సంపత్ రెడ్డి, బాలరాజు గౌడ్, రాజేష్, జహీర్ , స్వామి తదితరులు పాల్గొన్నారు.

Latest News

నాగసాన్పల్లీ పంచాయితీ పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ.... నాగసాన్పల్లీ పంచాయితీ పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ....
మాసాయిపేట, మార్చి 15 (ప్రజాస్వరం) :   మండలంలోని నాగసాన్పల్లీ పంచాయతీ వద్ద ఆ గ్రామ సర్పంచ్‌ మంతూరి ఆంజనేయులు పారిశుధ్య కార్మికులకు ఆదివారం నూతన వస్త్రాలను పంపిణీ...
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.....
సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి..
పారిశుధ్య కార్మికులకు సన్మానం... 
కార్మికులకు బట్టలు పంపిణీ....
కాలువలు పూర్తి చేయాలి.....
ఆదర్శ వార్డుగా కోసం ప్రజలు భాగస్వాములు కావాలి...