BRSV అసెంబ్లీ ముట్టడి.. ముందస్తు అరెస్టులు....
తూప్రాన్, మార్చి 24( ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు నాని వెంకట్ యూత్ అధ్యక్షులు శ్రీకాంత్ ల ను తూప్రాన్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు
BRSV ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో తూప్రాన్ మున్సిపల్ BRSV అధ్యక్షులు నాని వెంకట్ యూత్ అధ్యక్షలు శ్రీకాంత్*లను పోలీసులు తెల్లవారుజామున వారిని అదుపులోకి తీసుకొని తూప్రాన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని *BRSV*నాయకులు తీవ్రంగా ఖండించారు
ఎన్నికల సమయంలో విద్యార్థులకు కేటాయిస్తామని చెప్పిన 15% విద్యాకు నిధులు, 2 లక్షల ఉద్యోగాలు, విద్యకు భరోసా కార్డు, అలాగే నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్ ల విడుదల, చదువుకుంటున్న విద్యార్థినిలకు స్కూటీలు, 6 గ్యారెంటీలు* వంటి పలు హామీలను బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది అని వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు
ఈ హామీల అమలు కోసం శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడి చేపట్టాలని నిర్ణయించుకున్న విద్యార్థి నాయకులను ప్రభుత్వం ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు...!
అదేవిధంగా పోలీసులను ఉపయోగించి విద్యార్థి ఉద్యమాలనుఅణచివేయాలని రేవంత్ సర్కార్ కుట్ర పన్నుతోందని వారు తీవ్రంగా ఆరోపించారు...!
విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది...!
ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు BRSV ఉద్యమం ఆగదు అని విద్యార్థుల పక్షాన నిరంతరం గట్టి గళం వినిపిస్తామని
తూప్రాన్ మున్సిపల్ BRSV అధ్యక్షులు నాని వెంకట్ తెలిపారు


