ఆయిల్ ఫామ్ పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ ...
చేగుంట, మార్చి 16 ( ప్రజాస్వరం ):
జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ. దేవ్ కుమార్ చేగుంట మండలంలోని పెద్దశివునూర్ గ్రామంలో గల ఆయిల్ పామ్ పంటను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక సంఖ్యలో రైతులు ఆయిల్ పామ్ పంట వైపు మొగ్గు చూపాలని తెలిపారు, ఎందుకంటే ఈ పంటను ఒకసారి నాటినట్లయితే నాలుగవ సంవత్సరం నుండి దిగుబడి వరుసగా దాదాపు 25 సంవత్సరాల వరకు వస్తుందని తెలిపారు, ఈ పంట సాగు చేసుకోవడం ద్వారా కోతుల బెడద, అడవి పందుల బెడద, అకాల వర్షాలు, ఎటువంటి వాతావరణ పరిస్థితులైన తట్టుకుందని, ఈ పంట సాగు చేసుకోవడానికి ప్రభుత్వం 90% రాయితీ ఇస్తుందని, మొదటి నాలుగు సంవత్సరాలు 4వేల చొప్పున అంతర పంటలు సాగు చేసుకోవడానికి పెట్టుబడి కూడా ప్రోత్సాహకంగా ఇస్తుందని తెలిపారు, కావున రైతు సోదరులందరూ ఆయిల్ పామ్ పంటను సాగు చేయడానికి ముందుకు రావాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, పెద్దశివనూర్ గ్రామ సర్పంచ్ ఎర్ర సిద్ధిరాములు, ఉప సర్పంచ్ అన్నం మల్లేష్, వ్యవసాయ విస్తరణ అధికారి భువనేశ్వరి, రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు.


