6 వ వార్డులో పంచాంగ శ్రావణం పాల్గొన్న కౌన్సిలర్ గుమ్మడిదల మహేశ్వరి రాజేష్....
మేడ్చల్, మార్చి 19 (ప్రజాస్వరం):
మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు రాజాబొల్లారం లో పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగను వార్డు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరం ఉగాది పండుగను స్వాగతిస్తూ ప్రతి ఇంటి ముందు మామిడి తోరణాలు అలంకరించి, వేప చిగురు, బెల్లం, చింతపండు, మామిడికాయల పచ్చడి తో పాటు బచ్చాలు ఆరగించారు.రాజబొల్లారం గ్రామంలోని శ్రీ హనుమాన్ సమేత సీత రామచంద్ర స్వామి దేవస్థానం వద్ద పురోహితుడు మోహన్ శర్మ ఆధ్వర్యంలో నూతన సంవత్సర ఉగాది పంచాంగ శ్రావణం నిర్వహించారు.
ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా ఉంటాయని, పాడి పంటలు సమృద్ధిగా పడతాయన్నారు, పశువులకు అనుకూలంగా ఉంటుందని, అలాగే ప్రజలకు కూడా అన్ని రాశుల వారికి కూడా అనుకూలంగా ఉంటుందని మోహన్ శర్మ తెలిపారు.
ఈ కార్యక్రమంలో 6 వ వార్డు కౌన్సిలర్ గుమ్మడిదల మహేశ్వరి రాజేష్,రెడ్డిపల్లి వెంకటేష్, బాలాగిరి వెంకటేష్, భిక్షపతి, మల్లేష్, ఆనం వెంకటేష్, రమేష్, నాగరాజు, గోదా వెంకటేష్, రాజు లతో పాటు గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.


