ఉపాధి హామీని... నిర్వీర్యం చేస్తున్న కేంద్ర సర్కార్....

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆంక్షా రెడ్డి...

ఉపాధి హామీని...  నిర్వీర్యం చేస్తున్న కేంద్ర సర్కార్....

పూజ్య మహాత్మా గాంధీ పేరును తొలగించడం సిగ్గుచేటు ...

 

గజ్వేల్, మార్చి 16 (ప్రజాస్వరం ):

 

గ్రామీణ ప్రాంత కూలీలు, నిరుపేద రైతుల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్రo లోని బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూoకుంట అంక్షారెడ్డి విమర్శించారు. వర్గల్, తునికి ఖల్సా, తునికి మక్త, మీనాజీపేట్, శాకారం, అంబర్ పేట గ్రామాల్లో సోమవారం ఉపాధి హామీ కూలీలతో విధానసభలు ఏర్పాటు చేసి ఆమె మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మార్చాలనే దుర్బుద్ధితో... విబిజి రాంజీ పేరుతో కేంద్ర నిధుల్లో కోత విధించి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర సర్కార్ 40 శాతం నిధులు సమకూర్చాలని పేర్కొంటున్నట్లు ఎద్దేవా చేశారు. వ్యవసాయ కూలీలు, కార్మికుల హక్కులు, వ్యవసాయ అనుబంధ పనులు తొలగించి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. అయితే నిరుపేద రైతులు, వ్యవసా కూలీలు, గిరిజనులు, కార్మికుల ఉపాధి కరువైన సందర్భంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చేపట్టి కడుపునిండా భోజనం పెట్టినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలనే లక్ష్యంతో ఉన్న కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఉపాధి హామీ కూలీలతో విధాన సభలు, సమావేశాలు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, మండల కాంగ్రెస్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు వెంకటేష్, సర్పంచులు, ఉప సర్పంచ్లు విజయలక్ష్మి యాదగిరి, కొండగళ్ల గణేష్, కుమార్ యాదవ్, కుమార్, గోరెమియా, టేకులపల్లి గోవర్ధన్ రెడ్డి, గంగుమల్ల లక్ష్మి, సహదేవ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, మండల శాఖ అధ్యక్షులు పంజాల సాయి గౌడ్, నేతలు గంగుమల్ల కొండల్ రెడ్డి, నీల శ్రీనివాస్, పాషా భాయ్, యాదగిరి, పొన్నాల నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Latest News

చలో అసంబ్లీ కి వెళ్లే అంగన్వాడీ టీచర్ల ను ముందస్తు అరెస్ట్....  చలో అసంబ్లీ కి వెళ్లే అంగన్వాడీ టీచర్ల ను ముందస్తు అరెస్ట్.... 
తూప్రాన్, మార్చి 16( ప్రజాస్వరం ) :   పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలంలోని అంగన్వాడీ టీచర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు...
తూప్రాన్ లో మల్లికార్జున స్వామి కళ్యాణం...
రోడ్డు కు అడ్డంగా విరిగి పడిన భారీ వృక్షం ...
వైభవంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం..
ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ సుజాత మల్లేశం గౌడ్..
వైద్య ఖర్చులు నేనే భరిస్తా మైనంపల్లి భరోసా...
సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన మైనంపల్లి...