రోడ్డు కు అడ్డంగా విరిగి పడిన భారీ వృక్షం ...
By Prajaswaram
On
తూప్రాన్, మార్చ్ 16 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామ శివారులో భారీ వృక్షం నేలకూలడంతో పెను ప్రమాదం తప్పింది. గుండ్రెడ్డిపల్లి నుంచి మల్కాపూర్ వెళ్లే రహదారిపై గాలి దుమారం తో కూడిన వర్షం కారణంగా చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరు రాకపోకలు సాగించకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ గ్రామస్తులతో కలిసి ట్రాక్టర్ సహాయంతో చెట్టును రోడ్డు పై నుండి తొలగించారు. తక్షణమే స్పందించి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించిన సర్పంచ్ పై పలువురు ప్రశంసలు కురిపించారు.
Latest News
16 Mar 2026 19:54:11
తూప్రాన్, మార్చి 16( ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలంలోని అంగన్వాడీ టీచర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు...


