వైద్య ఖర్చులు నేనే భరిస్తా మైనంపల్లి భరోసా...
చిన్న శంకరంపేట, మార్చి 16 ( ప్రజాస్వరం ):
చిన్న శంకరంపేట మండలం కొరివిపల్లి గ్రామానికి చెందిన బంటు నర్సింలు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ఇంటికి చేరుకున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు, వైద్య ఖర్చుల నిమిత్తం 25 వేల రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు, కొరివిపల్లి గ్రామానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాలని వాహన ఖర్చులు భరిస్తానని ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఆయన గ్రామస్తులకు సూచించారు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ముందుగానే సమాచారం అందిస్తే నేమ్స్ ఆసుపత్రియా లేదా ఇతర ఆస్పత్రికి తరలించాలని ఆలోచన చేసి వైద్యులతో మాట్లాడి వైద్యులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని, ఆసుపత్రి ఖర్చులు కూడా తానే భరిస్తానని ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులకు తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సర్పంచ్ పుల్లారావు ఉపసర్పంచ్ నరసింహులు, మాజీ జెడ్పిటిసి కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, శ్రీమాన్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాజు రెడ్డి, సురేందర్ నాయక్, యాదవరావు, లింగమూర్తి, చిరంజీవి, రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


