వైభవంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం..

పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్....

వైభవంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం..

మెదక్, మార్చ్ 16 (ప్రజాస్వరం):

 

మెదక్ జిల్లా శంకరంపేట ఆర్ మండలం భగీరథపల్లి గ్రామంలో సోమవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో సోమవారం మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం.పద్మ దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూళ్ల సావిత్రి పోచయ్య, మాజీ సర్పంచ్ దయాకర్ యాదవ్, మాజీ మండల రైతు సమన్వయ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సర్పంచ్ లు చిలుక నాగరాజు, ఇమ్మడి నరేష్, నాయకులు మహిపాల్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

చలో అసంబ్లీ కి వెళ్లే అంగన్వాడీ టీచర్ల ను ముందస్తు అరెస్ట్....  చలో అసంబ్లీ కి వెళ్లే అంగన్వాడీ టీచర్ల ను ముందస్తు అరెస్ట్.... 
తూప్రాన్, మార్చి 16( ప్రజాస్వరం ) :   పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలంలోని అంగన్వాడీ టీచర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు...
తూప్రాన్ లో మల్లికార్జున స్వామి కళ్యాణం...
రోడ్డు కు అడ్డంగా విరిగి పడిన భారీ వృక్షం ...
వైభవంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం..
ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ సుజాత మల్లేశం గౌడ్..
వైద్య ఖర్చులు నేనే భరిస్తా మైనంపల్లి భరోసా...
సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన మైనంపల్లి...