సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన మైనంపల్లి...
చిన్న శంకరంపేట, మార్చి 16 ( ప్రజాస్వరం):
చిన్న శంకరం పేట మండలం కొరివి పల్లి పంచాయతీ పరిధిలోని కొరివి పల్లి తండాలో సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు భూమి పూజ నిర్వహించారు, ఈ సందర్భంగా గిరిజన మహిళలు వారి సాంప్రదాయ నృత్యం చేస్తూ ఘన స్వాగతం పలికారు, ఆలే కమిటీ సభ్యులు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ దేవాలయ నిర్మాణానికి మైనంపల్లి హనుమంతరావు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సేవే పరమపదిగా భావిస్తూ మైనంపల్లి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, స్థానిక సర్పంచ్ పుల్లారావు, ఉపసర్పంచ్ నర్సింలు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, శ్రీమాన్ రెడ్డి, రాజు రెడ్డి, యాదవరావు, శ్రీనివాస్ రెడ్డి, లింగమూర్తి, ఉదయకుమార్, రమేష్ గౌడ్, చిరంజీవి, శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్, తండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


