ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ సుజాత మల్లేశం గౌడ్..

ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్..

ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ సుజాత మల్లేశం గౌడ్..

నార్సింగి, మార్చ్ 16 ( ప్రజాస్వరం ):

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల "ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక" లో భాగంగా సోమవారం మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి మండల వైద్యారోగ్య అధికారి డా.రవి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశ్ గౌడ్ ప్రారంభించారు. మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా వైద్యారోగ్య అధికారి డా. శ్రీరామ్ సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారి వైద్య బృందానికి పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం డా. శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వచ్చే నెలలో కూడా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. వైద్య శిబిరంలో స్త్రీ వ్యాధి, చిన్న పిల్లల, పంటి, కంటి, జనరల్ వైద్యం విభాగాలకు చెందిన నిపులతో వైద్యం అందివ్వడం జరుగుతుందని వివరించారు. జిల్లాలో దాదాపు 90 వేల మంది బీపీ కోసం, 54 వేల మంది షుగర్ వ్యాధి, 574 క్యాన్సర్ బాధితులు ఉన్నారని అన్నారు. జిల్లాలో ఉన్న స్వయం సహాయక సంఘాలలో ఉన్న దాదాపు 1.45 లక్షల మహిళలతో పాటు, 40 సం లు ఆపై బడిన వయసు మహిళలకు ప్రణాళికా బద్ధంగా శిబిరంలో ప్రత్యేకంగా గర్భ కోశ సమస్యలు ఉంటే వారి ఆధార్, ఫోన్ నెంబర్ వంటి తదుపరి చికిత్స కోసం అవసరమున్న వివరాలు సేకరించి క్యాన్సర్ పరీక్ష కోసం వారి నుంచి "పాప్ స్మియర్" నమూనాలు తీసుకుని టీ హబ్ లో పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. పరీక్షలలో క్యాన్సర్ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయిన వారికి తదుపరి చికిత్స అందిస్తామని అన్నారు. క్యాన్సర్ తో పాటు అన్ని రకాల సమస్యలకు ప్రాధమిక పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి చికిత్స అందిస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాల పై ఆశాలు, ఏ.ఎన్.ఎం లు ప్రజలలో అవగాహన కల్పించడం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రజలు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని జిల్లా వైద్యాధికారి డా. శ్రీరామ్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేశ్ గౌడ్, హెచ్.ఈ.ఓ శ్రీనివాస్, ఎం.పీ.హెచ్.ఏ సూపర్వైజర్ ఉమా రాణి, కృష్ణా, స్టాఫ్ నర్స్ లక్ష్మీ బాయి, పల్లె దవాఖానా వైద్యులు, నర్సింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు .

Latest News

చలో అసంబ్లీ కి వెళ్లే అంగన్వాడీ టీచర్ల ను ముందస్తు అరెస్ట్....  చలో అసంబ్లీ కి వెళ్లే అంగన్వాడీ టీచర్ల ను ముందస్తు అరెస్ట్.... 
తూప్రాన్, మార్చి 16( ప్రజాస్వరం ) :   పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలంలోని అంగన్వాడీ టీచర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు...
తూప్రాన్ లో మల్లికార్జున స్వామి కళ్యాణం...
రోడ్డు కు అడ్డంగా విరిగి పడిన భారీ వృక్షం ...
వైభవంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం..
ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ సుజాత మల్లేశం గౌడ్..
వైద్య ఖర్చులు నేనే భరిస్తా మైనంపల్లి భరోసా...
సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన మైనంపల్లి...