తూప్రాన్ లో మొల్లమాంబ జయంతి వేడుకలు....
తూప్రాన్, మార్చ్ 13 (ప్రజాస్వరం):
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ పట్టణంలోని మొల్ల మాంబ విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్ మాట్లాడుతూ రామాయణాన్ని తెలుగులో అనువదించిన తొలి మహిళా మొల్ల మాంబ జయంతి సందర్భంగా స్మరిస్తూ ఆమె చేసిన సేవల్ని గుర్తు చేశారు వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచిస్తే మొల్లమాంబ ఐదు రోజుల్లోనే తెలుగులో రాయగలిగినది అని ఆమె గుర్తు చేశారు కౌన్సిలర్ కుమ్మరి రాములు మాట్లాడుతూ మొల్ల మాంబ జయంతి వేడుకలు ప్రభుత్వం నిర్వహించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది అని ఆయన తూప్రాన్ మండలంలో కుమ్మరి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఆయన కోరారు మొల్ల మాంబ ఆశయాలను ముందు తీసుకెళ్లారని యువకులను మహిళలను కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సమత కాశిరెడ్డి చెలిమెల ప్రియాంక జైపాల్ రాథోడ్ జ్యోత్స్న వేణు ఐలేష్ యాదవ్ నాయకులు చెలిమల జయరాములు మహేష్ ప్రవీణ్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు


