నీటి నిలువలు తొలగించడం పరిసరాల పరిశుభ్రత...
తూప్రాన్, మార్చ్ 13 (ప్రజాస్వరం):
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపాలిటీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజులకార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజుమున్సిపల్ కమీషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో 16 వార్డుల యందు Dry Day Friday కార్యక్రమం నిర్వహించి నీటి నిల్వలను తొలిగించడం, పరిసరాలను శుభ్రపరచడం, డ్రైనేజీలు శుభ్రపరచడం, బ్లీచింగ్ పౌడర్ అప్లై చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో లో వార్డు కౌన్సిలర్స్, మెప్మా RP లు మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగినది. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నోడల్ అధికారి శ్రీ.విశ్వనాథ్ రాజ్, SE, TUFIDC తూప్రాన్ మున్సిపల్ గల పలు వార్డులలో సందర్శించి ఇట్టి కార్యక్రమంలో నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాలు అమలు చేస్తున్న విధానం పట్ల నోడల్ అధికారి మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి మరియు సిబ్బందిని అభినందించడం జరిగినది. అనంతరం మన పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత ఆయన అన్నారు


