రాష్ట్ర స్థాయికి ఎంపికైన తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థులు....
చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 28 ( ప్రజాస్వరం):
మెదక్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో సోషల్ ఫోరం సహకారంతో మాడల్ ఐక్యరాజ్యసమితి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లాలోని 28 పీఎంసీ పాఠశాల నుండి విద్యార్థులు హాజరయ్యారు 56 దేశాల ప్రతినిధులుగా పాల్గొని ఆ దేశాల తరఫున చర్చలో పాల్గొన్నారు, సమావేశంలో పాల్గొని ప్రసంగించినటువంటి తెలంగాణ మోడల్ పాఠశాల చిన్న శంకరంపేటకు చెందిన ఆర్తి చంద్ర 9 వ తరగతి, అభిజ్ఞ 9వ తరగతి, చైతన్య 9వ తరగతి, ముగ్గురు విద్యార్థులు గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలంగాణ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ వాణి తెలిపారు, రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ వాణి తో పాటు సిబ్బంది గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పాఠశాల కేంద్రం ముగ్గురు విద్యార్థులు గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం చాలా గర్వంగా ఉందని విద్యార్థులు ముందు ముందు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థుల ఎంపికకు కృషిచేసిన సిబ్బందికి విద్యార్థులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఎంపికైన విద్యార్థులను ఆమె అభినందించారు.


