కాలం చెల్లిని ఐస్ క్రీంఅమ్ముతున్నా మహావీర్ పార్లర్ యజమాని పై కేసు...
తూప్రాన్, మార్చ్ 13 (ప్రజాస్వరం) :
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న మహావీర్ ఐస్ క్రీమ్ పార్లర్ లో కాలం చెల్లిన ఐస్ క్రీమ్లు ఆహార పదార్థాలను సీజ్ చేసినట్లు రాణి ఎస్సై గంగరాజు ఫుడ్ ఇన్స్పెక్టర్ జ్ఞానేశ్వర్ లు తెలిపారు
గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు తూప్రాన్ ఎస్‌ఐ గంగరాజు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ కలిసి ఒక ఐస్ క్రీమ్ షాప్ పై అకస్మిక తనిఖీ నిర్వహించారు.
తనిఖీ సమయంలో గడువు ముగిసిన పలు ఆహార పదార్థాలు నిల్వ ఉంచి విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు గుర్తించారు. స్వతంత్ర మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు.
సంబంధిత ఆహార భద్రత చట్టాల ప్రకారం విచారణ చర్యలు ప్రారంభించబడినవి. ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా స్వాధీనం చేసిన గడువు ముగిసిన ఆహార పదార్థాలను అక్కడికక్కడే నాశనం చేయడం జరిగింది.
ఈ కేసులో ప్రతివాది పేరు షాపు యజమాని మహవీర్ పై కేసు నమోదు చేయబడింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.


