మేడ్చల్ జిల్లాలో తాగునీటి సమస్యపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం....
మేడ్చల్, (ప్రజాస్వరం):
జీహెచ్ఎంసీ పరిధిలోని 297, 298 డివిజన్లలో మేడ్చల్, పూడూరు, కిష్టాపూర్ ప్రాంతాల్లో ప్రజలు తాగునీరు,మురికి కాలువలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు సరైన పరిష్కారం చూపలేదని మండిపడ్డారు.గత తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు తాగునీరు ఎప్పుడూ అందుబాటులో ఉండేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటినుంచి పట్టణ ప్రజలకు నీటి సమస్యలు మొదలయ్యాయి అన్నారు. పట్టణ చుట్టుపక్కల గ్రామాల్లో అవసరానికి మించి నీటి సరఫరా జరుగుతుంది కేవలం మేడ్చల్ పట్టణానికే ఈ సమస్య ఎందుకు వొస్తుంది అని ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖాళీ బిందెలతో పాదయాత్రగా వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి,విష్ణు చారి, దయనంద్ యాదవ్ లు పాల్గొన్నారు.


