వర్షాలు సమృద్ధి గా కురిసి పంటలు పండుతాయి. ....
తూప్రాన్ , మార్చి 19 (ప్రజాస్వరం ):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని 4 వ వార్డులో హనుమాన్ దేవాలయ ఆవరణలో పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పట్టణ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కొత్త సంవత్సర ఉగాది పండుగను స్వాగతిస్తూ ప్రతి ఇంటి ముందు మామిడి తోరణాలు అలంకరించి, వేప చిగురు, బెల్లం, చింతపండు, మామిడికాయల పచ్చడి తో పాటు బక్షాలు ఆరగించారు. ప్రతి సంవత్సరము శ్రీ హనుమాన్ దేవాలయం వద్ద సంవత్సరానికి ఒక్క పురోహితుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర ఉగాది పంచాంగ శ్రావణం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం పురోహితుడు సోమయజుల రవీందర్ శర్మ పంచంగా శ్రావణం చదివి వినిపించారు ఈ ఏడు వ్యవసాయం చేసే రైతులకు సంతోష విషయం వర్షాలు సమృద్ధిగా ఉంటాయని, పంటలు సమృద్ధిగా పడతాయని,ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని పశువులకు అనుకూలంగా ఉంటుందని, బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని.అలాగే ప్రజలకు కూడా అన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుందని రవీందర్ శర్మ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ భైరం సత్యలింగం చెలిమల రాములు కొక్కొండ కాశిరెడ్డి పురోహితులు సలక కృష్ణ మూర్తి శర్మ ఉదయ్ శర్మ సలక రాజేశ్వర్ శర్మ ఆత్రేయ శర్మ ప్రవీణ్ శర్మ బిదురు రాజు శర్మ పట్టణ ప్రముఖులు ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.


