కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ 584వ జయంతి వేడుకలు....

కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ 584వ జయంతి వేడుకలు....

నార్సింగి, మార్చ్ 13 ( ప్రజాస్వరం ):


నార్సింగి మండల కేంద్రంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి కుమ్మరి మొల్లమాంబ 584వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా కుమ్మరి సంఘం అధ్యక్షులు కుమ్మరి నర్సింలు, సభ్యులు బాబు, లక్ష్మణ్ లు మాట్లాడుతూ మొల్లమాంబ కుమ్మరి సంఘం లో పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నామని వారన్నారు, సంస్కృతంలో ఉన్న రామాయణంను ఆరు కాండములలో సుమారు 870 పీఠికతో కలిపి రచించిన మొల్లమాంబ తెలుగింటి ఆడపడుచు గొప్ప మహిళగా ఆమె గొప్పతనాన్ని కొనియాడారు, తెలంగాణ ప్రభుత్వం శాలివాహన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ శాలివాహనులకు ప్రభుత్వం ప్రోత్సాహాలు అందించి ముళ్ళమాంబ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం అధ్యక్షుడు కుమ్మరి నర్సింలు, మల్లేశం, ఉపాధ్యక్షులు కుమ్మరి రవీందర్, సిద్ధిరములు, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి శ్రీనివాస్, నాయకులు కుమ్మరి బాబు, నారాయణ, సిద్ధిరములు, బాల్ రాజు, నవీన్, రాజు, తిరుపతి, సత్తయ్య, రమేష్, మల్లేశం, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

కాలం చెల్లిని ఐస్ క్రీంఅమ్ముతున్నా మహావీర్ పార్లర్ యజమాని పై కేసు...  కాలం చెల్లిని ఐస్ క్రీంఅమ్ముతున్నా మహావీర్ పార్లర్ యజమాని పై కేసు... 
తూప్రాన్, మార్చ్ 13 (ప్రజాస్వరం) : పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి   తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న మహావీర్ ఐస్ క్రీమ్ పార్లర్ లో...
నీటి నిలువలు తొలగించడం పరిసరాల పరిశుభ్రత...  
తూప్రాన్ లో హనుమాన్ మండల దీక్షలు.....
దాబాలపై ఆకస్మిక దాడులు 18 సిలిండర్ లు సీజ్... 
మెదక్ జిల్లా తూప్రాన్‌లో
వ్యవసాయ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి సమావేశం
కీసరగుట్టలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన టిటిడి ఛైర్మెన్  బి.ఆర్. నాయుడు