పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన మండల విద్యాధికారి డీప్లారాథోడ్ ...

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన మండల విద్యాధికారి డీప్లారాథోడ్ ...

చిన్న శంకరం పేట,   మార్చి 13 ( ప్రజాస్వరం ):

 

చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని మండల విద్యాధికారి డీప్లా రాథోడ్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ నుండి ఏప్రిల్ 13వ తేదీ వరకు సుమారు నెలరోజుల పాటు పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శంకరంపేట, తెలంగాణ మోడల్ పాఠశాల శంకరంపేట, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మీర్జాపల్లి, లో పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మండలంలో మొత్తం 477 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయడం జరుగుతుందని తెలిపారు, పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు సూచించారు, విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్షలు రాయాలని 100% ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు, 40 రోజుల పాటు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి స్నాక్స్ అందజేసి విద్యాబోధన చేయడం జరిగిందని విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని తల్లిదండ్రులు కూడా సహకరించాలని ఆయన కోరారు.

Latest News

కాలం చెల్లిని ఐస్ క్రీంఅమ్ముతున్నా మహావీర్ పార్లర్ యజమాని పై కేసు...  కాలం చెల్లిని ఐస్ క్రీంఅమ్ముతున్నా మహావీర్ పార్లర్ యజమాని పై కేసు... 
తూప్రాన్, మార్చ్ 13 (ప్రజాస్వరం) : పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి   తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న మహావీర్ ఐస్ క్రీమ్ పార్లర్ లో...
నీటి నిలువలు తొలగించడం పరిసరాల పరిశుభ్రత...  
తూప్రాన్ లో హనుమాన్ మండల దీక్షలు.....
దాబాలపై ఆకస్మిక దాడులు 18 సిలిండర్ లు సీజ్... 
మెదక్ జిల్లా తూప్రాన్‌లో
వ్యవసాయ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి సమావేశం
కీసరగుట్టలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన టిటిడి ఛైర్మెన్  బి.ఆర్. నాయుడు