నీటి ఆవిష్యకత పై రైతులకు అవగహన...

సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ....

నీటి ఆవిష్యకత పై రైతులకు అవగహన...

తూప్రాన్, మార్చి 22 (ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో నీటి ప్రాముఖ్యతపై సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ బాలవికాస్ సౌజన్యంతో గ్రామస్తులతో ర్యాలీ చేపట్టారు. అంతకుముందు రైతులకు నీటి ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. మానవ మునగడకు త్రాగునీరు, సాగునీరు అవసర ప్రాధాన్యతను ఈ సందర్భంగా వారు వివరించారు. రైతులకు సంబంధించిన బోరు బావుల వద్ద నీటి స్టోరేజ్ కోసం రీఛార్జ్ సోక్ ఫీట్లను 30 వేల రూపాయల వ్యయంతో బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ ఉచితంగా నిర్మిస్తుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలవికాస్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్, పాలక వర్గ సభ్యులు జిన్న కృష్ణ, పిట్ల వేణు, మన్నె తిరుపతి, రైతులు పాల్గొన్నారు.

Latest News

జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ను సన్మానించిన ... నూతన జిల్లా ఉపాధ్యక్షులు గడప దేవేందర్  జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ను సన్మానించిన ... నూతన జిల్లా ఉపాధ్యక్షులు గడప దేవేందర్ 
తూప్రాన్ ,మార్చి 22( ప్రజాస్వరం ):  పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉపాధ్యక్షులు గా గడప దేవేందర్ ను నియమించి పార్టీ బలోపేతం...
నీటి ఆవిష్యకత పై రైతులకు అవగహన...
మల్కాపూర్ ఆదర్శ 393 వ స్వచ్ఛభరత్... 
ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి తరలిన రైతులు...
సొంత నిధులతో వాటర్ సంపు నిర్మాణం చేయించిన కౌన్సిలర్....
ఎంపీ ఈటెల కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.....
డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం....